కనిగిరి: పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలి: కనిగిరిలో జరిగిన నేర సమీక్షలో సీఐ ఖాజావలి
కనిగిరి సర్కిల్ కార్యాలయంలో శనివారం సిఐ ఖాజావలి ఎస్ఐలతో నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సర్కిల్ పరిధిలోని కనిగిరి, పెద్ద చెల్లోపల్లి, హనుమంతునిపాడు మండలాల పరిధిలో పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఎస్ఐలకు ఆయన సూచించారు. ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అవలంబించాలని, శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో కనిగిరి ఎస్సై శ్రీరామ్, హనుమంతునిపాడు ఎస్ఐ మాధవరావు, పెదచెర్లోపల్లి ఎస్సై కోటయ్య పాల్గొన్నారు.