కొండపి: పొన్నలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ ఉమేరా ఆధ్వర్యంలో గర్భిణీలకు వైద్య పరీక్షలు నిర్వహణ
పొన్నలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం డాక్టర్ ఉమేరా ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన గర్భిణీ స్త్రీలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. క్రమం తప్పకుండా గర్భిణీలు వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. అలాగే ప్రసవం సమయంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాన్పు చేయించుకోవాలన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అందించే వైద్య సేవలను పొందాలన్నారు