కొండపి: టంగుటూరు రైల్వే ట్రాక్ పై రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి ఆత్మహత్య
టంగుటూరు మండల కేంద్రంలోని రైల్వే ట్రాక్పై గడ్డిపాటి శ్రీనివాసులు అనే రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి మంగళవారం ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగు చూసింది. వివరాలలోకి వెళ్తే.. రైల్వే ట్రాక్ పై మృతదేహాన్ని గమనించిన స్థానికులు టంగుటూరు పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని సదర్ పోలీసులు వెల్లడించారు.