కొండపి: పొన్నలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ఆశా కార్యకర్తల సమావేశం నిర్వహించిన కనిగిరి డిప్యూటీ డిఎంహెచ్ఓ సృజన
పొన్నలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ఆశా కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న కనిగిరి డిప్యూటీ డీఎంహెచ్వో సృజన మాట్లాడుతూ.. ఆశా కార్యకర్తలు బాధ్యతగా పనిచేసి గ్రామీణ ప్రాంత ప్రజలకు సక్రమంగా వైద్య సేవలు అందించాలన్నారు. అలాగే ఆరోగ్య సేవలకు సంబంధించిన వివరాలను రికార్డులలో తప్పక నమోదు చేయాలన్నారు. పీహెచ్సీలో కాన్పుల శాతం పెరిగే విధంగా ఆశాలు గర్భిణీలకు అవగాహన కల్పించాలన్నారు.