నారాయణపేట్: జూలై 9న కార్మిక కర్షక దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేద్దాం: రైతు సంఘం జిల్లా కార్యదర్శి
జులై 9వ తేదీన కార్మిక, కర్షకుల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరిగే సమ్మెను విజయవంతం చేద్దామని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఉడుమల గిద్ద గోపాల్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి అంజిలయ్య గౌడ్, బి.బలరాం పిలుపునిచ్చారు. శనివారం 11 గంటల సమయంలో నారాయణపేట జిల్లా కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలుగా కార్మికులపై, రైతులపై, సామాన్య ప్రజలపై మోయలేని బారాలువేస్తున్నదని విమర్శించారు. ఈ యొక్క దేశవ్యాప్త సమ్మెకు అధిక సంఖ్యలో కార్మికులు కర్షకులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.