కనిగిరి: పామూరులో శ్రీ మదన వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా వైభవంగా చక్రస్నానం, పూర్ణాహుతి హోమం
పామూరు పట్టణంలో కొలువైన శ్రీ మదన వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా శుక్రవారం వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారికి వైభవంగా చక్రస్నానం, పూర్ణాహుతి హోమ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. చక్రస్నానం, పూర్ణాహుతి హోమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీ నిర్వాహకులు కార్యక్రమాల అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి శ్రీగిరి రాజు నరసింహ బాబు, ఆలయ పండితులు, ఆలయ కమిటీ నిర్వాహకులు పాల్గొన్నారు.