కనిగిరి: ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం: వ్యకాస జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు
హనుమంతునిపాడు: ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని వ్యవసాయ కార్మిక సంఘం ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షులు బడుగు వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలని హనుమంతునిపాడు మండలంలోని దాసళ్ళ పల్లి, నరవ గోపాలపురం గ్రామాల్లో ఉపాధి కూలీలు గురువారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... ఉపాధి కూలీలకు గత ఐదేళ్లకు ముందు ఉన్న సమ్మర్ అలవెన్స్లు, మజ్జిగ, మంచినీరు వంటి సదుపాయాలు ఇప్పుడు లేవన్నారు. ఆ సదుపాయాలు కల్పించడంతోపాటు, పెండింగ్ బిల్లులను కేంద్రం రాష్ట్రానికి వెంటనే విడుదల చేయాలన్నారు.