కనిగిరి: నియోజకవర్గంలో గ్రామస్థాయి నుండి వైసీపీని బలోపేతం చేయాలి: కనిగిరిలో జిల్లా వైసీపీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి
కనిగిరిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా కనిగిరి నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జి దద్దాల నారాయణ యాదవ్, జడ్పిటిసి కస్తూరి రెడ్డి ఆధ్వర్యంలో శివప్రసాద్ రెడ్డికి స్వాగతం పలికారు. అనంతరం వైసిపి నాయకులతో సమావేశమైన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి... కనిగిరి నియోజకవర్గంలో గ్రామస్థాయి నుండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని సూచించారు.