దర్శి: తాళ్లూరు మండలంలో 'రైతులు భూసార పరీక్షలు నిర్వహించుకోవాలి : ఏవో ప్రసాదరావు
తాళ్లూరు మండలం, కొర్రపాటివారిపాలెం, మల్కాపురం గ్రామాలలో మట్టి నమూనా సేకరణపై అవగాహన కార్యక్రమాన్ని ఏవో ప్రసాద్ రావు గురువారం నిర్వహించారు. మండలంలో 804 శ్యాంపిల్లు టార్గెట్ ఇవ్వగా.. RSK పరిధిలో 56 నమూనాలు సేకరించాలని అధికారులకు సూచించినట్లు ఏవో తెలిపారు. భూసార పరీక్షలు వల్ల బహుళ ప్రయోజనాలున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వీఏఏలు, రైతులు పాల్గొన్నారు.