దర్శి: తాళ్లూరు మండలంలోని ప్రైవేటు పాఠశాలల్లో 25% ఉచిత అడ్మిషన్
2009 విద్య హక్కు చట్టం 12(1) ప్రకారం తాళ్లూరు మండలంలోని 8 ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం ఉచిత అడ్మిషన్ పొందొచ్చని ఎంఈవోలు సుబ్బయ్య, సుధాకర్ గురువారం తెలిపారు. అనాధ పిల్లలు, హెచ్ఐవి బాధితులు, దివ్యాంగులు, షెడ్యూల్ తెగలు, బీసీ, మైనార్టీ, ఓసీ అల్పాదాయ వర్గాల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు వారు పేర్కొన్నారు.