దర్శి: పట్టణంలో గడియార స్తంభం తొలగింపుపై అభిప్రాయాలను వ్యక్తం చేసిన స్థానికులు #localissue
Darsi, Prakasam | Apr 30, 2025 దర్శిలో ప్రధాన కూడలి వద్ద ఉన్న గడియార స్తంభం విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయమై పలువురు తమ అభిప్రాయాలను బుధవారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వాహనాల రద్దీ పెరిగి గడియార స్తంభం వద్ద ఇబ్బందికర వాతావరణం నెలకొని ఉన్నట్లు, దానిని తొలగించినట్లయితే వాహనాల రాకపోకలకు సౌకర్యవంతంగా ఉంటుందని పలువురు తెలిపారు. మరికొందరు ఇది చాలా ఏళ్ల నుంచి దర్శికి తలమానికంగా ఉంది. దీనికి ప్రత్యామ్నాయం చూడాలని కోరుతున్నారు.