దర్శి: కురిచేడు మండలం పడమర వీరపాలెంలో అక్రమంగా వెలికిస్తున్న తెల్లరాయిక్వారిని పరిశీలించిన మైనింగ్ అధికారులు
Darsi, Prakasam | Apr 30, 2025 కురిచేడు మండలంలోని పడమర వీరాయిపాలెం గ్రామంలో సర్వేనెంబర్ 8లో అక్రమంగా తెల్ల రాయిని వెలికితీస్తున్నారన్న సమాచారంతో బుధవారం మార్కాపురం మైనింగ్ శాఖ అధికారులు, రెవిన్యూ అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మైండ్ శాఖ అధికారులు మాట్లాడుతూ.. గతంలో తెల్ల రాయిని వెలికితీస్తున్నారన్న సమాచారంతో ఓ లారీని సీజ్ చేసి జరిమానా విధించినట్లు తెలిపారని మరల అక్రమార్కులు ఇదే రీతిన తెల్లరాయిని వెలికిస్తున్నారని, ఇలాగే కొనసాగితే సంబంధిత అక్రమార్కులపై కేసు నమోదు చేస్తామని వారు హెచ్చరించారు. అదేవిధంగా ఆ ప్రాంతంలో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు.