దర్శి: దొనకొండ మండల కేంద్రంలో వ్యవసాయ అధికారి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో భూసార పరిక్షలు నిర్వహణ
Darsi, Prakasam | Apr 30, 2025 దొనకొండ మండలంలో మండల వ్యవసాయ అధికారి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో బుధవారం భూసార పరీక్షల కోసం మట్టి నమూనాలను RSK సిబ్బంది సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని అన్ని రైతు సేవ కేంద్రంలో 795 మట్టి నమూనాలను సేకరించేందుకు ప్రణాళిక ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులు తమ భూమి పోషక విలువలు తెలుసుకొని వాటి ఆధారంగా ఎరువులు వేసి పంటను తెలుసుకొని సాగు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయకులు, రైతులు పాల్గొన్నారు.