చిన్మయి నగర్ జేఎన్టీయూ విశ్వవిద్యాలయం నందు జెఎన్టియు ఉపకులపతి సుదర్శన్ రావు ఆన్లైన్లో ద్వారా నిజ నిర్ధారణ కమిటీ సమావేశం
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని చిన్మయ నగర్ వద్ద జేఎన్టీయూ విశ్వవిద్యాలయం నందు శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు ఆన్లైన్ ద్వారా నిజ నిర్ధారణ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపకులపతి సుదర్శన్ రావు మాట్లాడుతూ జేఎన్టీయూ అనంతపురం పులివెందల పరిధిలోని జెఎన్టియు అనుబంధ అధ్యాపకులతో ఆన్లైన్ ద్వారా నిజ నిర్ధారణ కమిటీ సమావేశం నిర్వహించి నిజ నిర్ధారణ కమిటీకి సంబంధించిన పలు అంశాల గురించి ప్రత్యేకంగా ఆన్లైన్ ద్వారా చర్చించడం జరిగిందని జెఎన్టియు ఉపకులపతి సుదర్శన్ రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్టర్ కృష్ణయ్య, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.