రాప్తాడు: ఆత్మకూరు మండల కేంద్రంలో జిల్లా ఉన్నత పరిషత్ పాఠశాలలో మెగా పేరెంట్స్ 4.0 సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే పరిటాల సునీత
అనంతపురం జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో శుక్రవారం 11:30 గంటల సమయంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ 4.0 సమావేశంలో ఎమ్మెల్యే పరిటాల సునీత ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన పేరెంట్స్ 4.0 సమావేశంలో పాల్గొని విద్యార్థినిలు ఎదుర్కొంటున్న సమస్యలు తల్లిదండ్రుల సమస్యలు తెలుసుకోవడం జరిగిందని భవిష్యత్తులో ఆత్మకూరు జిల్లా పరిషత్ పాఠశాల మరింత అభివృద్ధి చేసేందుకు తన వంతు సహకారాన్ని అందిస్తానని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు.