కనిగిరి: పామూరు పట్టణంలో శ్రీ మదన వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు, మోహిని అవతారంలో ఊరేగిన స్వామి వారు, భారీగా తరలివచ్చిన భక్తులు
పామూరు పట్టణంలో కొలువైన శ్రీ మదన వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు దాదాపు 17 సంవత్సరాల తర్వాత జరుగుతున్నడంతో భక్తులు బ్రహ్మోత్సవాలకు భారీగా తరలివస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారు మోహిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించిన మోహిని అవతారంలో స్వామివారి గ్రామోత్సవం నిర్వహించగా భక్తులు భారీగా తరలివచ్చి, స్వామిని దర్శించుకొని పూజలు చేశారు. ఎటువంటి ఆవంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు చేపట్టారు.