కనిగిరి: ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్స్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కనిగిరి డి.ఎస్.పి సాయి ఈశ్వర్ యశ్వంత్ కు ఏఐవైఎఫ్ వినతి
కనిగిరి: ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్స్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్ ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి పోతుల ప్రభాకర్ కనిగిరి డిఎస్పి సాయి ఈశ్వర్ యశ్వంత్ ను కోరారు. ఏఐవైఎఫ్ నాయకులతో కలిసి సోమవారం కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ ను కలిసి ఆయన వినతి పత్రాన్ని సమర్పించారు. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్స్ వల్ల కనిగిరి నియోజకవర్గం లో ఎంతోమంది యువత జీవితాలు నాశనం అవుతున్నాయి అన్నారు. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్స్ కు పాల్పడకుండా గట్టి నిగాను ఏర్పాటు చేయడమే కాకుండా, బెట్టింగ్ నిర్వాహకులపై కఠినంగా వ్యవహరించాలని డిఎస్పీని పోతుల ప్రభాకర్ కోరారు.