కనిగిరి: పొదిలి పట్టణంలో ఈ నెల 11న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటనను జయప్రదం చేయాలి: కనిగిరి వైసీపీ ఇన్చార్జ్ నారాయణ యాదవ్
కనిగిరి పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో వైసీపీ కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ సోమవారం వైసీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పొగాకు రైతుల సమస్యలను తెలుసుకునేందుకు ఈ నెల 11న పొదిలి పట్టణానికి వస్తున్న మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనను కనిగిరి నియోజకవర్గం లోని వైసీపీ, నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. పొగాకు రైతుల సమస్యలను పరిష్కరించడంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విఫలమైందని, వారికి అండగా నిలిచేందుకే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పొదిలికి వస్తున్నారన్నారు.