కనిగిరి: ఎర్రచందనం ప్లాంటేషన్ పేరిట జరుగుతున్న మోసాలకు అడ్డుకట్ట వేయాలి: జిల్లా ఫారెస్ట్ అధికారి వినోద్ కుమార్
కనిగిరి పట్టణంలోని అటవీ శాఖ కార్యాలయంలో జిల్లా ఫారెస్ట్ అధికారి కే వినోద్ కుమార్ ఫారెస్ట్ అధికారులు, సిబ్బందితో ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డిఎఫ్ఓ మాట్లాడుతూ... ఎర్రచందనం ప్లాంటేషన్ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేస్తున్న మోసాలకు అడ్డుకట్ట వేయాలని సూచించారు. ఎర్రచందనం పెంచి, తామే ఆదాయం వచ్చేలా చేస్తామని చెప్పి ప్రజలకు ప్లాట్లు, భూముల రూపంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు విక్రయిస్తున్నారన్నారు. ఎర్రచందనం బాగా పెరగాలంటే 15 నుండి 20 సంవత్సరాలకు పైగా పడుతుందని, రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాత్రం తక్కువ సమయంలోనే ఆదాయం వచ్చేలా చేస్తామని మోసం చేస్తున్నారన్నారు.