కనిగిరి: దివ్యాంగులను ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ఆదుకోవాలి: నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ నారాయణ యాదవ్
కనిగిరి: దివ్యాంగులను ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ఆదుకోవాలని కనిగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి డాక్టర్ దగ్గర నారాయణ యాదవ్ అన్నారు. ఆదివారం సాయంత్రం కనిగిరి పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో కనిగిరి మండలం ఏరువారిపల్లి, దిరిశవంచ, హనుమంతునిపాడు, వెలిగండ్ల మండలం పందువ నాగులవరం, పామూరు మండలం మోపాడు, అయ్యవారిపల్లి గ్రామాలకు చెందిన దివ్యాంగులకు నారాయణ యాదవ్ ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. సకలాంగులతో సమానంగా దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, వారికి చేయూతను అందిస్తే తమ కాళ్లపై తాము నిలబడతారని నారాయణ యాదవ్ అన్నారు. మున్సిపల్ చైర్మన్ గఫార్, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.