మార్కాపురం జిల్లాలో నామినేషన్ల వేళ ఉద్రిక్తత.. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ*
మార్కాపురం జిల్లా తర్లుపాడు మండల కార్యాలయం వద్ద నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు కార్యాలయానికి వస్తుండగా, అక్కడ ఉన్న టీడీపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఘటనతో మండల కేంద్రంలో కొంతసేపు ఆందోళనకర వాతావరణం నెలకొంది. ముందస్తు జాగ్రత్తగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా సాగేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.