కనిగిరి: పట్టణంలో విద్యార్థులతో కలిసి పర్యావరణ పరిరక్షణ పై అవగాహన ర్యాలీ నిర్వహించిన జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్బారావు
కనిగిరి పట్టణంలో పర్యావరణ పరిరక్షణపై మార్కాపురం జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్బారావు శనివారం అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని విద్యార్థులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి మొక్కలు చేత బూని, పర్యావరణ పరిరక్షణ అవగాహన ర్యాలీని చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్బారావు మాట్లాడుతూ... పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాలన్నారు. మొక్కలు నారడం వల్ల పచ్చదనం పెంపండడమే కాకుండా సకాలంలో వర్షాలు కురుస్తాయని, మానవాళికి స్వచ్ఛమైన ఆక్సిజన్ లభిస్తుందని ఆయన తెలిపారు. ఎస్సై సందీప్ పాల్గొన్నారు.