మల్కాజిగిరి: రాజేంద్రనగర్ రిజిస్ట్రార్ ఆఫీస్ వద్ద బైకులో రూ.3 లక్షల నగదు చోరీ
రాజేంద్రనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద పార్క్ చేసిన డాక్యుమెంట్ రైటర్ మనోహర్ బైకు నుంచి రూ.3 లక్షల నగదు చోరీకి గురైంది. దుండగులు బైకు తాళం పగులగొట్టి, సీసీ కెమెరాల వైర్లు కట్ చేసి నగదు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.