ఘట్కేసర్: అవుషాపూర్ వైన్స్ వద్ద ఘర్షణ.. లారీ కింద పడి యువకుడు మృతి
అవుషాపూర్ లోని HL స్పిరిట్ వైన్స్ వద్ద జరిగిన ఘర్షణలో ఛత్తీస్గఢ్ కు చెందిన దుర్లబ్ అనే యువకుడు మృతి చెందాడు. గొడవలో శ్యామ్ తోసేయడంతో లారీ కింద పడి అతడు మరణించాడు. నిందితుల్లో ముగ్గురిని స్థానికులు పట్టుకోగా, ఘట్కేసర్ పోలీసులు కేసు నమోదు చేశారు.