మార్కాపురం: వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితుల పునరావస కాలనీలో శరవేగంగా జరుగుతున్న పనులు
మార్కాపురం మండలం ఇడుపూరు వెలిగొండ ప్రాజెక్టు పునరావస కాలనీలలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్లాట్లలో మట్టిని వేసి చదును చేస్తున్నారు. విద్యుత్, తాగునీరు, తదితర మౌలిక వసతులు కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. గతంలో నిర్మించిన పాఠశాల భవనాలకు తలుపులు, కిటికీలు తొలగించిన దృశ్యాలు కనపడుతున్నాయి. మళ్లీ వాటిని అమర్చాల్సి ఉంది. పట్టాల పంపిణీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి.