ఉరవకొండ: బెలుగుప్పలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం నందు ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని శ్రీ విరుపాక్షేశ్వర స్వామి ఆశ్రమం నందు వెలసిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠం నందు బుధవారం ఉదయం నుండి రాత్రి 8 గంటల వరకు గురు పౌర్ణమి వేడుకల సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకాలను మఠాధ్యక్షులు శ్రీ ఈశ్వర స్వామి ఆధ్వర్యంలో అర్చక పండితులు రాంబాబు స్వాములు నిర్వహించారు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మూల విరాట్ కు, శివలింగ స్వరూప స్వామివారికి భక్తులతో కలిసి పంచామృత అభిషేకాలను, పుష్పాలంకరణ పూజలు కుంకుమార్చన పూజలను నిర్వహించారు. ఆలయం వద్ద భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నదాన కార్యక్రమాలను మఠం సభ్యులు నిర్వహించారు.