*“కౌశిక్ తల్లి మౌలాబి మృతికి బాధ్యులెవరు? – తర్లుపాడులో ప్రజా సంఘాల నిరసన”**
**తర్లుపాడు:** కౌశిక్ మృతికి న్యాయం చేయాలని 16 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న అతని తల్లి సయ్యద్ మౌలాబి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ తర్లపాడు మండల కేంద్రంలో వివిధ ప్రజా, ముస్లిం మైనారిటీ, రాజకీయ సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ షేక్ మహబూబ్ వలి మాట్లాడుతూ కౌశిక్ మృతికి కారణమైన శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ యాజమాన్యంపై, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు, విద్యాశాఖ అధికారులపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా కోచింగ్ సెంటర్ ఎలా నిర్వహించారని ప్రశ్నించారు. మైనారిటీ కుటుంబానికి న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కార్యక్రమంలో MPJ రాష్ట్ర అధ్యక్షులు షేక్ అబ్దుల్ రజాక్, మాజీ MPTC షేక్ అక్బర్ బాషా, రైతు సంఘం నాయకులు పాపిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు హు�