పంట పొలాల్లో వైర్ల దొంగతనాలు
రైతుల్లో ఆందోళన – పోలీసుల నిఘా పెంచాలని విజ్ఞప్తి
కొమరోలు మండలం, రౌతుపల్లి: రౌతుపల్లి గ్రామ పరిధిలోని పంట పొలాల్లో ఇటీవల విద్యుత్ బోర్లకు సంబంధించిన వైర్లు కట్ చేసి దొంగిలించే ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామానికి చెందిన అవిసినేని రోశయ్య పొలంలో ఉన్న రెండు బోర్లకు సంబంధించిన వైర్లను దొంగలు కట్ చేసినట్లు సమాచారం. అదేవిధంగా పెద్దన్న పొలం, అవిసినేని చిన్న నారాయణ పొలాల్లో కూడా బోర్లకు సంబంధించిన వైర్లను దొంగలు కట్ చేసినట్లు రైతులు తెలిపారు.
ఇదే సమయంలో యాసం నరసింహులు పంట పొలంలో దొంగతనానికి ప్రయత్నించిన సమయంలో అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. సీసీ కెమెరాలను గమనించిన దొంగలు భయపడి అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది.
గత కొంతకాలంగా పంట పొలాల్లో బోర్లకు సంబంధించిన వైర్లు కట్ చేయడం, మోటార