ఉరవకొండ: ఉరవకొండలో తీవ్ర ఉద్రిక్తత, టిడిపి భూఆక్రమణలపై తహసిల్దార్ కార్యాలయం వద్ద మహా ధర్నాకు వెళ్తున్న విశ్వేశ్వర్ రెడ్డి అరెస్ట్
అనంతపురం జిల్లా ఉరవకొండలో తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైస్సార్సీపీ పార్టీ పీఏసీ సభ్యులు వై .విశ్వేశ్వర్ రెడ్డిని తహసిల్దార్ కార్యాలయం వద్ద సోమవారం టిడిపి భూఆక్రమణలపై మహాధర్నాకు పిలుపు ఇవ్వడంతో పోలీసు అనుమతులు లేవని విశ్వతో పాటు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, బిసి సెల్ నాయకులు రమేష్ గౌడ్ లను సైతం అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. పోలీసుల అక్రమ అరెస్టులను నిరసిస్తూ పోలీసు వాహనాల కు అడ్డుపడ్డ వైసీపీ శ్రేణులను నాయకులను పక్కకు తోసేసిన పోలీసుల తీరును నిరసిస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట ప్రధాన రహదారిపై రాస్తారోకోను సైతం వైసీపీ శ్రేణులు చేపట్టాయి.