కనిగిరి: సీఎం రిలీఫ్ ఫండ్ ను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి: కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి పట్టణంలోని టిడిపి కార్యాలయం నందు కనిగిరి నియోజకవర్గం లోని వివిధ మండలాలకు చెందిన లబ్ధిదారులకు బుధవారం ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి రూ.35.23 లక్షలు విలువచేసే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, ఆపద సమయాల్లో కార్పొరేట్ వైద్యశాలలో వైద్యం చేయించుకున్న రోగులను ఆదుకునేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సీఎం చంద్రబాబు ఆర్థిక సహాయాన్ని చేస్తున్నారన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ పొందిన లబ్ధిదారులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.