కనిగిరి: లేబర్ కోడ్స్ రద్దుచేసి కార్మిక చట్టాలను పునరుద్ధరించాలి: ప్రకాశం జిల్లా సిఐటియు కార్యవర్గ సభ్యులు కేశవరావు
కనిగిరి పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో మంగళవారం సిఐటియు కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్యఅతిథిగా సిఐటియు ప్రకాశం జిల్లా కార్యవర్గ సభ్యులు పీసీ కేశవరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక చట్టాల స్థానంలో తీసుకువచ్చిన లేబర్ కోడ్స్ కార్మికులకు తీరని అన్యాయం చేస్తాయన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి అన్నారు. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులు తమ సమస్యల పరిష్కారానికి సంఘటితంగా పోరాడాలన్నారు.