కనిగిరి: మురుగమ్మి జడ్పీ ఉన్నత పాఠశాలను పరిశీలించిన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహా రెడ్డి, విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ పంపిణీ
పెదచెర్లోపల్లి మండలంలోని మురుగమ్మి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంగళవారం ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పరిశీలించారు. మధ్యాహ్న భోజన పథకం అమలవుతున్న తీరు వివరాలను అడిగి తెలుసుకుని, కోడిగుడ్లను పరిశీలించి వారానికి ఎన్ని గుడ్లు ఇస్తున్నారో ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని నిర్వాహకులకు ఎమ్మెల్యే సూచించారు. అనంతరం పాఠశాల ఆవరణలో రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన స్కూల్ బ్యాగ్స్, నోట్ పుస్తకాలను ఎమ్మెల్యే విద్యార్థులకు పంపిణీ చేశారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.