కనిగిరి: దివాకరపురంలో రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణ పనులను అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి
పెదచెర్లోపల్లి మండలంలోని దివాకరపురం గ్రామంలో రిలయన్స్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. అనంతరం అధికారులతో ప్రత్యేకంగా సమావేశమైన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి... రిలయన్స్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మంత్రి నారా లోకేష్ చొరవతో కనిగిరి నియోజకవర్గం లో మరికొన్ని బయో గ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు రిలయన్స్ కంపెనీ ముందుకు వచ్చిందని,, బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుతో ఒక్కో ఎకరానికి రైతుకు రూ.35 వేలు ఏడాదికి కౌలు లభిస్తుంది అన్నారు.