కనిగిరి: టిడిపి కార్యాలయ నిర్మాణ పనులను నాణ్యంగా , త్వరితగతిన పూర్తి చేయాలి: కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి శాసనసభ్యులు మరియు ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఒంగోలులో నిర్మిస్తున్న జిల్లా టిడిపి కార్యాలయాన్ని ఆదివారం పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును పరిశీలించి సంబంధిత కాంట్రాక్టర్ కు ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు. టిడిపి కార్యాలయాన్ని నాణ్యవంతంగా, త్వరితగతిన పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్ ను ఎమ్మెల్యే ఆదేశించారు. కార్యాలయంలో అన్ని మౌలిక వసతులు కల్పించేలా ప్లాన్ రూపొందించడం జరిగిందని, ఆ ప్లాన్ కు అనుగుణంగా పనులు చేపట్టాలన్నారు. ప్రజలకు సేవ చేసే ఒక వారధిగా టిడిపి కార్యాలయం నిలిచిపోవాలన్నారు