ఉరవకొండ: వజ్రకరూరు మోడల్ స్కూల్ విద్యార్థులకు స్కూల్ సాయిల్ హెల్త్ ప్రోగ్రామ్ పై అవగాహన
అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంలోని మోడల్ స్కూల్‌లో విద్యార్థుల్లో నేల ఆరోగ్యం, నేల పరీక్షల ప్రాముఖ్యత మరియు స్థిరమైన వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించే ఉద్దేశంతో గురువారం స్కూల్ సాయిల్ హెల్త్ ప్రోగ్రామ్ నిర్వహించారు. వ్యవసాయ అధికారులు విద్యార్థులకు నేల పరీక్షల ఆవశ్యకత, నేలలో పోషక పదార్థాల ప్రాధాన్యత, సమతుల్య ఎరువుల వినియోగం, నేల ఆరోగ్య పరిరక్షణ ద్వారా అధిక దిగుబడులు సాధించే విధానాల గురించి వివరించారు. భవిష్యత్తులో ప్రకృతి వనరుల సంరక్షణతో కూడిన వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో విద్యార్థుల పాత్ర ఎంతో ముఖ్యమని ADA శ్రీ సత్యనారాయణ తెలిపారు.