రాప్తాడు: కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఎస్కే యూనివర్సిటీని బంద్ నిర్వహించిన విద్యార్థి సంఘం నేతలు
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని శ్రీకృష్ణదేవరాల విశ్వవిద్యాలయం నందు శుక్రవారం ఉదయం 10:30 గంటల నుంచి ఒకటిన్నర గంటల వరకు యూనివర్సిటీలో అన్ని విభాగాలను ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ ఎన్ ఎస్ యు ఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఎస్కే యూనివర్సిటీ ని బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ మహేష్ మాట్లాడుతూ నీటి పరీక్ష పేపర్లు లీకేజీ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థినిలకు కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని బంద్ నిర్వహించడం జరిగిందని రానున్న రోజుల్లో విద్యార్థి సమస్యలు పరిష్కరించుకుంటే పోరాటాలు చేస్తామని ఏఐఎస్ఎఫ్ మహేష్ పేర్కొన్నారు.