కొండపి: మర్రిపూడి మండలంలోని జి.అగ్రహారంలో పంటల దిగుబడులపై కేంద్ర, రాష్ట్ర గణాంకాల అధికారుల సర్వే
మరిపూడి మండలంలోని జి. అగ్రహారంలో కేంద్ర, రాష్ట్ర గణాంకాల అధికారులు, వ్యవసాయ, రెవెన్యూ సిబ్బంది సంయుక్తంగా పంట దిగుబడులపై సర్వే నిర్వహించారు. గత ఖరీఫ్, రబీ సీజన్లలో 20 మంది రైతులు పండించిన పంటలు, వాటి దిగుబడుల వివరాలను సేకరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జేడీ శ్రీనివాసరావు, మండల వ్యవసాయాధికారి సిహెచ్. వెంకటేష్ పాల్గొన్నారు.