పెద్దవడుగూరు మండలం కోనాపురం గ్రామంలోని కార్తికేయ ఎంటర్ప్రైజెస్ స్టోరేజ్ పాయింట్ లో చోరీ జరిగింది. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్టోరేజ్ పాయింట్ కు గుర్తు తెలియని దొంగలు కన్నం వేశారు. లోపలికి చొరబడ్డారు. సుమారు 8 లక్షల విలువైన పేలుడు పదార్థాలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై స్టోరేజ్ పాయింట్ నిర్వాహకుడు కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.