కనిగిరి: పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో మదర్ కేర్ యూనిట్ ను ప్రారంభించిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి
కనిగిరి పట్టణంలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో రూ.50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన కంగారూ మదర్ కేర్ యూనిట్ ను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ వీరాంజనేయ స్వామి కలెక్టర్ తమిమ్ అన్సారియా, ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తో కలిసి బుధవారం ప్రారంభించారు. మదర్ కేర్ యూనిట్ ను పరిశీలించి అక్కడ కల్పిస్తున్న సౌకర్యాలపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆధునిక వసతులతో మదర్ కేర్ యూనిట్ నిర్మాణానికి చర్యలు తీసుకున్న ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిని మంత్రి అభినందించారు. కార్యక్రమంలో అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.