ఉరవకొండ: కోనాపురం క్రాస్ వద్ద రోడ్డు ప్రమాదానికి గురైన మహిళ చికిత్స పొందుతూ మృతి
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రం నుండి గోళ్ళ గ్రామానికి పోవు దారి మధ్యలో కోనాపురం క్రాస్ వద్ద మంగళవారం రాత్రి ఎర్రగుడి గ్రామానికి చెందిన హరిజన మల్లికార్జున, హరిజన సాలమ్మ(36)లు ద్విచక్ర వాహనంలో వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురై సాలమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందిందని బెలుగుప్ప ఎస్ఐ శివ బుధవారం సాయంత్రం ఏడు గంటలకు పేర్కొన్నారు. ఘటనపై మృతురాలి భర్త హరిజన రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడమైనదని ఎస్సై పేర్కొన్నారు.