గిద్దలూరు: కంభం మండలం లింగాపురం గ్రామానికి చెందిన ఆవులయ్య అనే వృద్ధుడు అదృశ్యం, కనిపిస్తే సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి
మార్కాపురం జిల్లా కంభం మండలం లింగాపురం గ్రామానికి చెందిన ఆవులయ్య అనే 70 సంవత్సరాల వృద్ధుడు ఈనెల 6వ తేదీ నుంచి కనిపించడం లేదు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వృద్ధుడు తిరిగి ఇంటికి రాలేదు. ఇప్పటికే కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్ళల్లో అన్వేషించిన కుటుంబ సభ్యులు తర్వాత పోలీసులకు సమాచారాన్ని అందించారు. వృద్ధుడు అదృశ్యంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. ఎవరన్నా వృద్ధుడిని గుర్తిస్తే కంభం పోలీస్ స్టేషన్లో కానీ 9177269415 నెంబర్కు సమాచారం ఇవ్వాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.