జడ్చర్ల: జడ్చర్ల పట్టణంలో బోనాల పండుగకు పట్నం వెళితే ఇల్లు 20 తులాల బంగారు ఆభరణాలు గుల్ల
జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో తాళం వేసి ఉన్న ఇంటి తాళాలు పగులగొట్టి గుర్తుతెలియని దుండగులు 20 తులాల బంగారు ఆభరణాలను అపహరించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల ప్రకారం, జడ్చర్ల 9వ వార్డులోని అశోక్ నగర్ వెంచర్ సాయి వంశీ కాలనీలో నివసిస్తున్న వరలక్ష్మి టైలరింగ్ చేస్తూ జీవనం కొనసాగిస్తోంది. శనివారం బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్లో ఉంటున్న తన కూతురు, అల్లుడు ఇంటికి వెళ్ళడానికి గేటుకు తాళం వేసి బయలుదేరింది. ఆదివారం వరలక్ష్మి ఇంటి తాళాలు విరిగిపడి ఉన్నట్లు గమనించిన పొరుగువారు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. వెంటనే జడ్చర్లకు చేరుకున్న వరలక్ష్మి ఇంట్లోకి వెళ్లి చూసేసరికి ఇంట