జడ్చర్ల: కేసరోనిపల్లి గ్రామ లో ప్రమాదవశాత్తు నీట మునిగి యువకుడి మృతి
ప్రమాదవశాత్తు నీట మునిగి యువకుడు మృతిచెందిన ఘటన నవాబుపేట మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. కేసరోనిపల్లి గ్రామ పరిధిలోని దమొనిబండ తండాకు చెందిన యువకుడు తన అమ్మమ్మ ఊరైనా కొల్లూరు గ్రామ పరిధిలోని సత్తురోనిపల్లి తండాకు వచ్చాడు. స్నేహితులతో కలిసి నీటికుంట దగ్గరకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు ఆ నీటి కుంటలో పడి మృతి చెందాడు. దీంతో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.