జడ్చర్ల: జనంపల్లి దుశ్యంత్ రెడ్డి పై డీసీసీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేసిన రాజాపూర్ మండల అధ్యక్షుడు
జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి సోదరుడు జనుంపల్లి దుశ్యంత్ రెడ్డిపై శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి కు రాజాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కత్తెర కృష్ణయ్య యాదవ్ ఫిర్యాదు చేశారు. పార్టీ కార్యకర్తలను వేధిస్తూ, నాయకులపై జులం చేస్తున్నారని ఆయన అక్రమాలపై, అయన చర్యల వలన పార్టీకి కలిగి నష్టాన్ని వివరించారు. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.