నస్పూర్: మంచిర్యాల కలెక్టరేట్ వద్ద 29వ రోజుకు చేరిన NHM ఉద్యోగుల నిరసన
మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట NHM ఉద్యోగుల నిరసన 29వ రోజుకు చేరుకుంది. ఉద్యోగాల క్రమబద్ధీకరణ, సమాన పనికి సమాన వేతనం, PRC, ఇంక్రిమెంట్లు మరియు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వం నుండి లిఖితపూర్వక హామీ వచ్చే వరకు పోరాటం ఆపేది లేదని ఉద్యోగులు స్పష్టం చేశారు.