ముగ్పాల్: తాళ్లరాంపూర్ విడిసిపై చర్యలు తీసుకోవాలని గౌడ సంఘాల డిమాండ్
గౌడ కులస్తులపై సాంఘిక బహిష్కరణ, దాడులకు పాల్పడుతున్న తాళ్లరాంపూర్ విడిసిపై చర్యలు తీసుకోవాలని మోపాల్, నిజామాబాద్ రూరల్ గౌడ సంఘాలు డిమాండ్ చేశాయి. చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, లేదంటే చలో రాంపూర్ చేస్తామని హెచ్చరించాయి.