ఉరవకొండ: గ్రామ గ్రామాన మలేరియా వ్యతిరేక మాసోత్సవ ర్యాలీ కార్యక్రమాలు
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం పరిధిలోని విడపనకల్లు, వజ్ర కరూర్ ఉరవకొండ మండలాల్లోని పలు గ్రామాల్లో గురువారం వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది మలేరియా వ్యతిరేక మాసోత్సవ ర్యాలీ కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని ఉరవకొండ డివిజన్ మలేరియా సబ్ యూనిట్ అధికారి బత్తుల కోదండరామిరెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గంలోని కౌకుంట్ల, గడేకల్లు, గుల్యపాలెం, పాల్తూరు గ్రామాల్లో మలేరియా వ్యతిరేక మాసోత్సవ ర్యాలీ కార్యక్రమాలను నిర్వహించారు. ప్రధానంగా దోమల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని దోమలు కుట్టకుండా దోమతెరలు వాడాలని, వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత, డ్రై డే పాటించాలన్నారు.