ఆత్మకూరు ఎం: యాదాద్రిలో వెండి కుదువ వ్యవహారంలో వివాదం: నకిలీ వెండి ఇచ్చారంటూ మహిళ ఆందోళన
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరులో వెండి కుదువ వ్యవహారం కలకలం రేపింది. అప్పుగా తీసుకున్న 30 వేలకు 90 వేలు వసూలు చేసి, అసలైన వెండికి బదులుగా నకిలీవి ఇచ్చారని బాధితురాలు వ్యాపారి దుకాణం ఎదుట నిరసన తెలిపింది. ఈ ఘటనపై పూర్తి విచారణ జరపాలని ఆమె కోరుతున్నారు.