రాప్తాడు: పంపునూరులో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఎల్ నినో ప్రభావం ఉండకూడదు అని వరుణ హోమం ప్రారంభించిన పరిటాల సునీత
అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపునూరు గ్రామంలో సోమవారం తొమ్మిదిన్నర గంటల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పంపనూరు సుబ్రమణ్య స్వామి వారి ఆలయంలో ఏర్పాటు వరుణ హోమములో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన పూజారి సీతా రామ్మోహన్ శర్మ మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఎల్ నినో ప్రభావం రాష్ట్రానికి నష్టం జరగకుండా ఉండాలని ప్రజలు సుభిక్షంగా ఉండాలని పంపునూరు సుబ్రమణ్య స్వామి వారి ఆలయం నందు ప్రత్యేకంగా వరుణ హోమం సహస్ర గంటాభిషేకం నిర్వహిస్తున్నామని పంపనూరు సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయ ప్రధాన పూజారి సీతా రామ్మోహన్ శర్మ పేర్కొన్నారు.