ఉరవకొండ: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కు, టిడిపి శ్రేణులకు మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాస్ వార్నింగ్..
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం శాసనసభ్యులు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కు, టిడిపి శ్రేణులకు మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి సోమవారం ఉరవకొండ లో మాస్ వార్నింగ్ ఇచ్చారు. పయ్యావుల కేశవ్ నీ ఇంటి పాలేర్లతోనో లేక చిల్లర మనుషులతో నన్ను తిట్టిస్తున్నావు. నేను అనుకుంటే అంతకంటే ఎక్కువగా మా వైయస్సార్సీపి నాయకులతో నిన్ను తిట్టించగలను. కానీ నేను నీలాగా చిల్లర నాయకుడిని.. కాదు చిల్లర రాజకీయాలు చేయను.